అశ్వాపురం గ్రామపంచాయతీ లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని నర్సరీలో మొక్కల సంరక్షణకు షేడ్ నెట్ ల ఏర్పాటు

పయనించే సూర్యుడు, మార్చి 15, అశ్వాపురం: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక (99 రోజుల) కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ఆధ్వర్యంలో వేసవి కాలం దృశ్య నర్సరీ మొక్కల సంరక్షణ కొరకు షేడ్ నెట్ ఏర్పాటు పనులు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం నందు ఉప సర్పంచ్ తుళ్ళూరీ ప్రకాష్ రావు, పంచాయతీ కార్యదర్శి కందిమళ్ల శ్రీకాంత్, వార్డు సభ్యులు వేములపల్లి హసిత, చంద్రకళ ,ధనలక్ష్మి,రమాదేవి, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్, మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *