పయనించే సూర్యుడు మార్చి 15 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల కేంద్రం ఖానాపురం మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీలతో సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ రోజువారి వేతనం పడే విధంగా నిబంధనల ప్రకారం పనిచేసి సమాన పనికి సమాన వేతనం వచ్చే విధంగా చేయాలని అన్నారు తమరు చేసే పని మీదనే గ్రామానికి వచ్చే అభివృద్ధి నిధులకు ముడిపడి ఉంది కాబట్టి లేబర్ కాంపౌండ్నేంట్ పెంచే విధంగా గ్రూపుల వారిగా బాధ్యులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు సమస్యలు ఉంటే నేరుగా గ్రామపంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు