
పయనించే సూర్యుడు మార్చి 15, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకం, పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతోనే నేడు జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం కాకినాడ జిల్లాలో పలు నియోజవర్గాల్లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా కేంద్రం కాకినాడలో నగర పార్టీ అధ్యక్షులు, స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాను పరిష్కరించారు, అనంతరం కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పిఠాపురం పట్టణాన్ని చేరుకుని ఉప్పాడ బస్టాండ్, నంది సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు, అలాగే పిఠాపురం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ ని కట్ చేసి, కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీగా గొల్లప్రోలు పట్టణాన్ని చేరుకుని మొగలి సూరీడు చెరువు వద్ద ఏర్పాటుచేసిన 30 అడుగుల భారీ పార్టీ జెండాను ఆవిష్కరించారు, అలాగే స్థానిక తహసిల్దార్ కార్యాల వెనక ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు, అనంతరం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గొల్లప్రోలు మండలం, చేబ్రోలు లో పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్తిపాడు నియోజవర్గం కత్తిపూడి, శంఖవరం గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబీ) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో బలమైన మార్పు కోసం అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ దశాబ్ద కాలంలో అనేక కష్టాలు, సవాళ్లు దీటుగా ఎదుర్కొని నేడు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగిందన్నారు. జీరో నుండి మొదలైన పార్టీ నేడు 100% స్ట్రైక్ రేట్ తో రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం వెనక కార్యకర్తలలు, వీర మహిళలు కష్టం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుపరిపానలలో జనసేన పార్టీ భాగస్వామ్యం అవుతుందని, రాబోయే రోజుల్లో బూత్ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేసి జనసేన పార్టీని బలమైన శక్తిగా మార్చేందుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలో సాగుతున్న పార్టీ సభ్యత నమోదులో సాధక్ లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించి కాకినాడ జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు), మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.