పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 15 చండూరు పురపాలక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మున్సిపల్ చైర్మెన్ గా ఎన్నికైన డా కోడి శ్రీనివాసు లు మరియు కౌన్స్ లర్ గా ఎన్నికైన కోడి శుష్మ వెంకన్న లను వారి తోటి విద్యార్థులనా ఎస్.ఎస్.సి 1992-93 బ్యాచ్ ఘనంగా సన్మానించారు. అదేవిదంగా అక్కడే ఉన్న మున్సిపల్ వైస్ చైర్మెన్ బూతరాజు దశరథని కూడా సత్కరించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చిన్ననాటి అవకాశాలని నెమరువెసుకుంటూ వొచ్చన అవకాశాన్ని ప్రజా సేవకోసం వినియోగిస్థానని మున్సిపల్ అభివృద్ధికోసం కృషి చేస్తానని తెలియచేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు పాటల వెంకన్న,వర్కల కృష్ణ,మొండికత్తి నర్సింహా, శ్రీనివాస్ రెడ్డి,పోలేని నర్సింహా, ఉపేందర్ రెడ్డి, బూతరాజు ఆంజనేయులు, కారింగు బిక్షం, నర్సింహా చారీ, లింగస్వామి,తడ కమల్ల శ్రీధర్, కటకం శ్రీనివాస్ రెడ్డి,కారింగు రాజు, శ్రీను,వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.