జగనన్న లేఔట్ లో దాహం కేకలుచిమ్మ చీకట్లో జగనన్న లేఅవుట్లుకనీస మౌలిక సదుపాయాల కల్పనలు దరిదాపుల్లో కనబడట్లేదు.రేషన్ సదుపాయాన్ని కాలనీవాసులకు కల్పించాలి

* జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు _ ప్రజా సమస్యల్ని విన్న వైసిపి నేతలు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా / జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 15 జగ్గయ్యపేట పట్టణం, బలుసుపాడు రోడ్డు, జగనన్న లేఅవుట్ -2 లో సరైన మౌలిక సదుపాయాలు లేవని విషయాన్ని తెలుసుకొని ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరావు , రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్న) మరియు పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ స్థానిక నాయకులు కలిసి పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రధాన సమస్యలు :- నీటి సమస్య సుమారుగా 400 ఇల్లు నివాసం ఉంటున్న ప్రజలకు తాగునీరు అందక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు, నీటి కోసం ఆనాడు వైసిపి ప్రభుత్వం లో పాలేరు ద్వారా మోటర్ తో నీటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. కానీ క్రమేపి అది అగంతులకు, దొంగలకు వైర్లు కట్ చేయడం‌ మరియు ఇప్పుడు వేసవికాలం దృష్టిలో ఉంచుకొని పాలేరులో నీటి పారుదల లేకపోవడంతో దుర్వాసన వస్తున్నాయి. ప్రజలు నీటి సమస్య పరిష్కారంగా ఒక బోరు వేపించవలసిందిగా కోరారు. వీధి దీపాలు సమస్య రెండో సమస్య జగనన్న లేఅవుట్లో వీధి దీపాలు వెలగట్లేదు, రాత్రుల సమయంలో మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు, వీధి దీపాలు త్వరితగతన అమర్చాలని తెలిపారు. రేషన్ సమస్య రేషన్ షాప్ ఏర్పాటు చేయాలి, కాలనీవాసులు రేషన్ తీసుకోవాలంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జగ్గయ్యపేట పట్టణానికి వెళ్లి తీసుకోవాల్సి వస్తుంది, దీనితో వృద్ధులు ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్నారు, దీనికి పరిష్కారంగా కాలనీలో ఒక రేషన్ షాప్ ఏర్పాటు చేసి నిత్యవసర సరుకులు అందజేయాలని కోరారు. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీ సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ మాటలకే పరిమితం తప్ప ప్రజల సమస్యలు కనబడవు అని అన్నారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అయిందని మీరే అన్నారు కానీ ఇక్కడ కాలనీవాసులు చూస్తుంటే ఎక్కడో 50 సంవత్సరాల క్రితం మారుమూల గ్రామంలో ఉన్నట్టుగా నీటి కోసం పాలేరు కుపోయి బకెట్ బిందెలతో తీసుకొని రావాల్సిన పరిస్థితి. ఎక్కడ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అని ఎద్దేవా చేశారు. ఈ నీటి సమస్య, విద్యుత్ దీపాలు, రేషన్ సమస్యలు అన్ని వారం లోపల పరిష్కరించకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, రాష్ట్ర చేనేత విభాగ అధికార ప్రతినిధి పెంటి శ్రీనివాసరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కీసర లోకేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి, పింగళి నరసింహారెడ్డి, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, సీనియర్ నాయకులు లాహోరి బద్దు నాయక్, స్థానిక నాయకులు జక్కులూరి సురేష్, ఆనందరావు, పట్టణ యువజన విభాగ అధ్యక్షులు రామిని ఉపేందర్ రెడ్డి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు పిడమర్తి ప్రభువు, మున్సిపల్ వింగ్ అధ్యక్షులు అన్నేపాక మురళి, వార్డు అధ్యక్షులు గుంజ రోశయ్య, మన్నే అప్పారావు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఉసా సురేష్, జిల్లా పంచాయతీరాజ్ కార్యదర్శి శీలం మంగారావు, జిల్లా మహిళా కార్యవర్గ సభ్యులు షేక్ దూదాబి, షేక్ ఖాదర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *