జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని (14/03/2026) పురస్కరించుకుని పుంగనూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం, అంబేద్కర్ కూడలి వద్ద పుంగనూరు మండల జనసేన నాయకులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు చలివేంద్రం , మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 15.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ O ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు సి ఐ సుబ్బ రాయుడు మరియు రూరల్ ఎస్ ఐఆన్సర్ భాష చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. సమాజంలో కష్టపడి పనిచేసే కార్మికులకు సేవ చేయడం జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒక ముఖ్యమైన అంశం. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జనసేన పార్టీ స్థాపకులు పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పుంగనూరు మండల అధ్యక్షుడు విరూపాక్షి, జనసేన పోగ్రామ్స్ కమిటీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, పుంగనూరు మండల ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి హరి నాయక్, మండల కార్యదర్శులు బాలాజీ నాయక్, వెంకటేష్, శ్రీనివాసులు, మండల నాయకులు పాముల హరి, శ్రీరాములు, పవన్ కుమార్,జనార్దన్ రాయల్, వెంకటేశ్ ,మణి, రమేష్, నాగరాజ నాయక్,బాబు, జ్ఞానేంద్ర, మహేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.