తస్లీమా కు అభినందలు:- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి

పయనించే సూర్యుడు మార్చి 15 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ యోగి వేమన విశ్వవిద్యలయం నుండి జర్నలిజం లో రాష్ట్ర గవర్నర్ చేతుల మీద స్వర్ణ పతకం పొందిన సోదరి ఎస్ . కే తస్లీమా కు స్వయాన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా ఒక అమ్మాయి అయి ఉండి కూడా ఎంతో కష్ట పడి ఎన్నో రాత్రులు నిద్ర వదులు కొని ఈరోజు 2 గోల్డ్ మెడల్ లు సాధించటం దీనికి సహకరించిన తల్లిదండ్రుల కృషి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా మైనారిటీ సమాజం లో ఉన్న బాలికలను ప్రతి ఒక్కరు చదివించాలని ఆకాంక్షించారు. అదే విధాoగా మీ గళాన్ని మహిళల అభ్యున్నతికి మరియు సమాజం లోజరుగుతున్నటువంటి అన్యాయాలాపై మీ కలం తో పోరాడాలని ఆశిస్తున్నానని తెలిపారూ.