పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 15 మందమర్రి మండల రిపోర్టర్ బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు లో ఉన్న అమర వీరుల స్తూపం వద్ద తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు తెలంగాణ షేర్ అనభేరి ప్రభాకర్ రావు దేశ్ముఖ్ గారి 78 వ వర్ధంతి సందర్భంగా ప్రభాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బీసీ సంఘాల నాయకుడు గజెల్లి వెంకటయ్య ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ అన్నదాతకు ప్రాణదాత నేతన్నకు బతుకు బాట పేదోడికి దేవుడు ఉద్యమానికి ఊపిరి ఆడపడుచుల ఆత్మ గౌరవం తెలంగాణ వీర కిశోరం అని ప్రభాకర్ రావు మరణం తెలంగాణ ప్రజనికానికి తీవ్రలోటని పేర్కొన్నారు అదే విధంగా అనభేరీ ప్రభాకర్ రావు దేశ్ముఖ్ విగ్రహాన్ని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని ప్రభాకర్ రావు జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట వీరుడు అనభేరి ప్రభాకర్ రావు కి జోహార్లు అని నినాదాలు చేశారు