పదో తరగతి పరీక్షలు విద్యార్థుల సిద్ధంగా ఉండాలి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 15 పెనుగంచిప్రోలు మండలం పరిధిలోని పలుచోట్ల స్కూళ్లలో ఎగ్జామ్స్ వివరాలు తెలియపరిచిన పెనుగంచిప్రోలు మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ రవీంద్ర నాయక్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు సెంటర్లో 16-03-2026 నుండి 01-04-2026 వరకు పదవ తరగతి పరీక్షలు. పెనుగంచిప్రోలు మండలం లోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ బాయ్స్ పాఠశాల, జడ్పీహెచ్ఎస్ స్కూల్ గర్ల్స్ రెండు పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు ది. 16-03-2026 నుండి ప్రారంభ మగుచున్నవి. రెండు పరీక్ష సెంటర్ లకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ ఆఫీసర్ లు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయడమైనది. మండలం లోని 9 పాఠశాలల నుండి 480 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ బాయ్స్ పాఠశాలనుండి 250 మంది విద్యార్థులు, పి హెచ్ ఎస్ స్కూల్ గర్ల్స్ పాఠశాల నుండి 230 మంది విద్యార్థులు మొత్తం 480 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మండలం లోని నవాబు పేట విశ్వ వాణి పాఠశాల నుండి 23 మంది విద్యార్థులు నందిగామ లో పరీక్షలు రాయనున్నారు. పెనుగంచిప్రోలు మండలం లోని మొత్తం 10 పాఠశాల ల నుండి 480+23=503 మంది విద్యార్థులు హాజరగుచున్నారు.