పాలెం రామ్‌నగర్ కాలనీలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

పయనించే సూర్యుడు మార్చి 15 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినాపల్లి మండలం పాలెం గ్రామం రామ్‌నగర్ కాలనీలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. పి. శ్రీనివాసులు (తండ్రి పి. పుల్లయ్య) గత మూడు సంవత్సరాలుగా తమ తండ్రి కీర్తిశేషులు స్వర్గీయ పుల్లయ్య గారి స్మారకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రతి సంవత్సరం పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్లు మరియు ఇతర అవసరమైన పరీక్షా సామాగ్రిని అందిస్తూ తన సేవాభావాన్ని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా పి. శ్రీనివాసులు మాట్లాడుతూ రామ్‌నగర్ కాలనీలోని విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనబరిచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *