పేదల ఆత్మగౌరవం పెంపునకే ఇందిరమ్మ ఇళ్లు

ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చెస్తున్నదని.

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి /15: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం నియోజకవర్గం అన్ని గ్రామం లోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు రావాలని ఎమ్మెల్యే,, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. శనివారం తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో పార్నంది శ్రీలత-శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాకుండా వారిలో ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్నామని ఆయన చెప్పారు. అర్హులైన వారందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మాణాలు చేపట్టని వారిని గుర్తించి వారి స్థానంలో అర్హులైన ఇతరులను ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. ప్రగతిలో ఉన్న ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి గృహ ప్రవేశాలు జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోరండ్ల గ్రామ సర్పంచు అసోది శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ పోరండ్ల గ్రామశాఖ అధ్యక్షుడు చింతల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ చింతల లక్ష్మారెడ్డి, పార్టీ నాయకులు మామిడి అనిల్ కుమార్,పోలు రాము, రమేశ్, జనార్దన్ రెడ్డి, బొజ్జ రవి, గడ్డం రమేశ్ తదితరులు పాల్గొన్నారు. సితార రెస్టారెంట్ ప్రారంభం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని సుభాష్ నగర్ లో నూతనంగా నెలకొల్పిన సితార రెస్టారెంట్ ను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యజమాని రొండ్ల నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధగోని లక్ష్మినారాయణగౌడ్, మోరపల్లి రమణారెడ్డి, శ్రీగిరి రంగారావు, మామిడి అనిల్ కుమార్, నందికొండ తిరుపతిరెడ్డి ,కొమ్మెర మల్లారెడ్డి, భూతం నర్సయ్య, తూర్పాటి అజయ్ తదితరులు పాల్గొన్నారు