ప్రధానమంత్రి ఉచిత సూర్య ఘర్ సోలార్ ఏర్పాటు.

★ దేవీపట్నం మండలం పెద్దభీమ్ పల్లి మూడు ఆర్&ఆర్ కాలనీలో ప్రధానమంత్రి ఉచిత సూర్య ఘర్ సోలార్ ఏర్పాటు. ★ బిజెపి నాయకులు నడిపూడి భాను శంకర్ రెడ్డి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.15 .2016 పోలవరం జిల్లా,రంపచోడవరం కేంద్రంగా దేవిపట్నం మండలం పెద్దభీమ్ పల్లి 3,న్యూ ఆర్&ఆర్ కాలనీలో ప్రధాన మంత్రి సూర్యఘర్ ద్వారా ఉచిత సోలార్ అప్లై చేసిన వారికీ ఇవ్వడం జరిగింది. మిగిలిన పేర్లు రెండో విడుతగా మంజూరు అవుతాయి అని తెలియ జేయడమైనది. భారత దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉచిత విద్యుత్ ను అందించడమే. లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం పథకం ఇది.పీఎం సూర్య ఘర్ ఉచిత పథకం.ఇళ్ల పై కప్పుల పై సౌర ఫలకాలు ఏర్పాటు.చేసుకుని సౌర విద్యుత్తు పొందడానికి సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది.2023-24 నుంచి 2026-27 వరకు నాలుగేళ్లు నడిచే ఈ పథకానికి 75,021/-కోట్లు రూపాయలు కేటాయించింది.ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఇంతకీ ఈ పథకం కింద రాయితీ ఎంత? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ముందుగా పీఎం సూర్యఘర్(పీఎం సూర్యాఘర్ గవర్నమెంట్ ఇన్)పోర్టల్లో పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి.మీ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నంబరు, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. కన్జ్యూమర్ నంబర్,మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి.అక్కడ"రూప్టాప్ సోలార్"కోసం అప్లయ్ చేసుకోవాలి.దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్ లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్ మీటర్ను ఇన్స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు.ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ను పోర్టల్ సబ్మిట్ చేయాలి.30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది. కరెంట్ బిల్లుకు భయపడి కొన్ని రకాల వస్తువులను వాడాలంటేనే ఆలోచనలో పడతారు.మనలో చాలామంది. అయితే ఇంటి పైనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు.చేసుకొని తగినంత కరెంట్ను ఉత్పత్తి చేసుకునేందుకు కేంద్రం ఓ ప్రత్యేక పథకం ప్రవేశపెట్టింది.అంతేకాదు ఎక్కువైన విద్యుత్తును విక్రయించుకొని ఆదాయం కూడా పొందవచ్చు.ఈ పథకం పేరు "ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్ బిజిలీ" (పీఎం సూర్య ఘర్ మఫ్ట్ బిజెలి యోజన)ఈ పథకం కింద ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం(పీఎం సూర్య ఘర్ బిజెలి యోజన)కింద రాయితీని రెండు భాగాలుగా విభజించి కేంద్రం ఇవ్వనుంది.రెండు కిలోవాట్ల సామర్థ్యానికి60%,అంతకు పైబడిన యూనిట్లకు40%,మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు.మూడు కిలోవాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు.చేయడానికి1.45/-లక్షలు రూపాయలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్ఠంగా78/-వేలు రూపాయలు అందిస్తుంది. మిగిలి మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమకూరుస్తుంది. రెపోరేట్కు అదనంగా 0.5%వడ్డీని దానిపై వసూలు చేయనుంది. ప్రస్తుతం ఇది7%ఉంది.ఎవరికి ఎంత కెపాసిటీ నెలకు0-150యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి1-2కిలోవాట్ల రూఢాప్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని సూర్యఘర్ వెబ్సైట్లో పేర్కొన్నారు150-300యూనిట్లు చొప్పున వినియోగించే వారు. 2-3కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ను ఏర్పాటు.చేసుకోవాల్సి ఉంటుంది. 300 యూనిట్లకు పై బడి విద్యుత్ను వినియోగించే వారు3కిలోవాట్ ఆ పైబడి సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మూడు కిలోవాట్లకు మించి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా గరిష్ఠంగా78/-వేలురూపాయలు మాత్రమే సబ్సిడీగా చెల్లిస్తారు.కరెంట్ అమ్ముకోవచ్చు..ఇంటిపై ఏర్పాటు. చేసుకునే సోలార్ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్లో తొలి300యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా విక్రయించుకోవచ్చు. దీనివల్ల నెలకు1,265/-రూపాయలు ఆదాయం వస్తుంది.అందులో610/-రూపాయలని బ్యాంకు రుణవాయిదా కింద జమ చేసుకుంటారు.దీనివల్ల ఏడేళ్లలో ఆ రుణం తీరిపోతుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు.ఒకటి కిలోవాట్కు30/-వేలురూపాయలు రెండు కిలోవాట్ల వ్యవస్థ ఏర్పాటు.చేసుకున్నవారికి 60/-వేలు రూపాయలు మూడు కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు.చేసుకున్న వారికి78/-వేలు రూపాయలు గరిష్ఠ రాయితీ అందుతుందని చెప్పారు.ఈ పథకం కింద గృహలను వారి ఇంటికి పై భాగంలో సౌర పలకాలను ఏర్పాటు.చేసుకోవడానికి కేంద్రం సబ్సిడీ అందిస్తుంది.ఇందులో భాగంగా దేవిపట్నం మండలం లో మొదటి విడతగా460 గృహాలు మంజూరు అయ్యాయి.ఏజెన్సీ ప్రాంతంలో(పివిటిజీ)లు బాగా వెనుకబడి ఉన్నారు.అనే సంగతి రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్రం ప్రభుత్వాలు గుర్తించి మారుమూల ప్రాంతాంలాకు రోడ్లు మరియు ఉచిత సోలార్ మరియు ఉచిత విద్యుత్ మరియు ఉచిత పథకాలకు సబ్సిడీ పెట్టి(పివిటిజీ)లకు మరిన్నో అవకాశాలు కల్పింస్తోంది ఈ కూటమి ప్రభుత్వం.రాబోయే రోజుల్లో నూతనంగా ఏర్పటైనా పోలవరం జిల్లాలో(పివిటిజీ)లకు అవకాశాలు ఏర్పాటు దిశగా కూటమి.ప్రభుత్వం పనిచేస్తుంది.మొత్తం దేవీపట్నం మండలానికి సుమారుగా460పేర్లు మొదటి లిస్ట్ గా పేర్లు విడుదల అయ్యాయి.అని బీజేపీ నాయకులు నడిపూడి భాను శంకర్ రెడ్డి,కుండ్ల సాయిరాం రెడ్డి తెలిపారు.ముఖ్యం గా భారత ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు.అటు కేంద్రానికి,రాష్ట్ర ప్రభుత్వం(కూటమికి)నికి కూడ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో సోలార్ సహాయకులు పాల్గొన్నారు.భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ మీ బీజేపీ నాయకులు నడిపూడి భాను శంకర్ రెడ్డి,కుండ్ల సాయిరాం రెడ్డి.