ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. వివరాలు వెల్లడిస్తున్న ఎంఈఓ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 15 బోధన్ :10వ తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో సాలూర మండలంలో 4 పాఠశాలలకు గాను 1 పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.శనివారం తెలుగు,హిందీ,ఉర్దూ పరీక్షలు నిర్వహించారు.4 పాఠశాలలకు గాను 214 మంది విద్యార్థులు ఉండగా ఒక విద్యార్థి గైర్హాజరు కావడంతో 213 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు మండల విద్యాశాఖ అధికారిని రాజీ మంజూష వెల్లడించారు.మండల ఎంపీడీవో శ్రీనివాస్,ఎంఈఓ రాజీమంజూష పరీక్షా కేంద్రంలో సందర్శించారు.పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.విద్యార్థులు మరియు సిబ్బందికి కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంతో పాటు విద్యార్థులు మరియు సిబ్బంది కొరకు అన్ని సౌకర్యాలను సమకూర్చినట్లు ఎంపీడీవో,ఎంఈఓ తెలిపారు.