బిజినపల్లిలో స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు – 16న అభ్యర్థులు హాజరు కావాలి

బిజినపల్లి మండల విద్యాధికారి రఘువర్ధన్

పయనించే సూర్యుడు మార్చి 15 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ మండల పరిధిలోని స్పోర్ట్స్ స్కూల్ 2026–27 విద్యా సంవత్సరానికి ఇటీవల దరఖాస్తు చేసుకున్న రిజిస్ట్రేషన్ అభ్యర్థుల ఎంపికలు ఈ నెల 16వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు బిజినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలుర)లో నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి రఘునందన్ తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరూ తమకు సంబంధించిన అన్ని అవసరమైన ధ్రువపత్రాలు, సర్టిఫికేట్లు తీసుకుని సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు. ఎంపికల ప్రక్రియలో పాల్గొనే విద్యార్థులు ముందుగానే అక్కడికి చేరుకోవాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *