బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లుఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు

జనం న్యూస్ , మార్చి 15, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ఇల్లంతకుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత పనులు చేపడుతున్నామని, ఆలయానికి రంగులు వేయిస్తున్నామని ఆయన తెలిపారు.ఈ నెల 25వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీన ఏకాంత సేవతో ముగుస్తాయని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈవో సుధాకర్, ధర్మకర్తలు పరమేష్, కిరణ్, రామ్‌రెడ్డి, నారాయణరెడ్డి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.