భవిత కేంద్రం ప్రారంభించిన యంయల్ ఏ

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 15 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం భవిత కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ రాయికల్ మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, వైస్ చైర్మన్ తురగా సౌజన్య, కౌన్సిలర్ పుర్రె శ్రీధర్ లతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు సమగ్ర శిక్ష అభియాన్ కింద భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన (దివ్యాంగ) చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి, విద్యను అందించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలు ఏర్పాటు చేశారని అన్నారు ఐఈఆర్పీ బోధకుల ద్వారా బోధన, ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలను అందిస్తూ, ఈ పిల్లలలో ఆత్మస్థైర్యాన్ని పెంచి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు జగిత్యాల జిల్లాలోని భవిత కేంద్రాలకు ప్రభుత్వ నిధులు మంజూరు చేసి, మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు ఈ కేంద్రాలు దివ్యాంగ పిల్లలకు తల్లిదండ్రులపై భారం తగ్గించి, వారికి తోడుగా నిలుస్తున్నాయని అన్నారు .ఈ కార్యక్రమంలో యంపిడివో చిరంజీవి తహశీల్దార్ నాగార్జున యంఇఓ యస్.రాఘవులు,ఐఈఆర్పీ పి.సృజన ఉపాధ్యాయులు చెరుకు మహేశ్వర శర్మ, కౌన్సిలర్ లు బత్తిని మానస, గంగాధర్ వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు దివ్యాంగపిల్లలు తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు పలకలు బలపాలు అందజేశారు .ఈ సందర్భంగా యంయల్ ఏ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ లను ఘనంగా సన్మానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *