మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

★మరోవైపు వినూత్న ఆలోచనలతో ప్రజల వద్దకే (వ్యాది నిర్దారణ) పరీక్షలు ★మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ముఖ్యం . ★మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 15 మునుగోడు నియోజకవర్గంలో నివసించే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య సేవ కార్యక్రమాలు చేపట్టారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దాంట్లో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా సొంత ఖర్చుతో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారు.. ఇప్పటివరకు 12 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 9034 మందికి కంటి పరీక్షలు జరిపి 1970 మందికి సక్సెస్ ఫుల్ గా కంటి పరీక్షలు చేయించారు… వీరిలో రెండు కండ్లు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు.. కంటిచూపు సమస్యతో తమ పనులు కూడా తాము చేసుకోలేని స్థితిలో ఉన్న వృద్ధులకు మహిళలకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు వారి కండ్లలో వెలుగులు నింపుతున్నాయి.. ఉచిత కంటి వైద్య శిబిరాలలో మరో ముందడుగు ల్యాబ్ ఆన్ వీల్స్ తో ప్రజల వద్దకే (వ్యాధి నిర్ధారణ) పరీక్షలు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలలో పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్న కొంతమందికి వివిధ కారణాలవల్ల కంటి ఆపరేషన్లు చేయలేకపోతున్నారు డాక్టర్లు.. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు… ఇతర ఏ అనారోగ్య సమస్యలు ఉన్న కూడా వాటిని ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల దగ్గరే పరీక్షించే విదంగా మొబైల్ ల్యాబ్ కం ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.. కంటి పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు కూడా ఈ మొబైల్ ల్యాబ్ కం ఆసుపత్రిలో చేస్తారు.. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి డాక్టర్ల సలహా మేరకు అవసరమైతే వారికి ఏ ఏ మందులు వాడాలనే సూచనలు కూడా ఇస్తారు.. దీంతో ఇప్పటివరకు కేవలం కంటి పరీక్షలకే పరిమితమైన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు శిబిరానికి వచ్చిన పేషెంట్ ఏ ఏ వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతున్నాడనే సమాచారాన్ని కూడా ఈ మొబైల్ ల్యాబ్ కం ఆసుపత్రి ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. రేపే 13 వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల గ్రామ ప్రజలకు ఇప్పటికే ఒకసారి నాంపల్లి మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి 1028 మందికి పరీక్షలు జరిపి వారిలో 229 మందికి కంటి ఆపరేషన్లు పూర్తి చేశారు.. మరోసారి మునుగోడు లోని క్యాంపు కార్యాలయం ఆవరణలో రేపు నాంపల్లి మండల ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. మొబైల్ ల్యాబ్ కమ్ ఆసుపత్రి సేవలు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి, ఫీనిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ నియోజకవర్గంలోని నిరుపేదలు అనారోగ్యంతో బాధపడకుండా ఉండాలని, వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాల ఆరోగ్యంగా ఉంటాయని, కుటుంబాల ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనే నాణుడి ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజం చేస్తున్నారు .