మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం

★ బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య

పయనించే సూర్యుడు, మార్చి 15 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రానికి చెందిన బిట్టి యాదయ్య కొన్ని రోజుల నుండి అనారోగ్యానికి గురై హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం జరిగింది. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల కన్యాకుమారి జోగయ్య శనివారం యాదయ్యను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి హాస్పిటల్ ఖర్చులకు మెరుగైన వైద్యం కోసం రూ, 5000/- రూపాయలను ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. యాదయ్యను అధర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చి అన్ని విధాల ఆదుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు మెంబర్ సిరిసనగండ్ల శేఖర్, మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, మాజీ ఎంపిటిసి చలిచీమల జ్యోతి నిరంజన్, మాజీ ఎంపీటీసీ లింగం, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్, ఎమ్మెస్ గౌడ్, గొడుగు శివ, గణేష్, సైదులు, భాస్కర్, శ్రీకాంత్, వారణాసి శేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు.