మెరుగైన వైద్య సేవలను అందించాలి.

★ఆసుపత్రి భవన నిర్మాణం కొరకు కృషి చేస్తాం. ★ మందుల కురత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ★డిఎంహెచ్ఓ రాజాశ్రీ.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 15 బోధన్:సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా వైద్య అధికారి రాజశ్రీ డాక్టర్స్ మరియు సిబ్బందినిఆదేశించారు.శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు.ఆసుపత్రికి సంబంధించిన రికార్డులు,మందుల సరఫరా రిజిస్టర్ లను తనిఖీ చేశారు.వైద్య సేవలు మరియు నిర్వహణ గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్,సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి పాత భవనాన్ని డీఎంహెచ్ఓ పరిశీలించారు.ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కొరకు ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తామని పేర్కొన్నారు.ఆసుపత్రి పరిసరాల శుభ్రత పై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఆసుపత్రి నిర్వహణ సక్రమంగా ఉండడం వలన డిఎంహెచ్ఓ సంతృప్తి వ్యక్తం చేశారు.సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలనిఆదేశించారు. లేనియెడల శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు,సిబ్బంది ఉన్నారు.