పయనించే సూర్యుడు మార్చి 15, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ: సంప్రదాయం, స్నేహబంధం, ఆనందోత్సాహాల నడుమ మేడపాటి కుటుంబంలో ఘనంగా జరిగిన వివాహ మహోత్సవం అందరినీ ఆకట్టుకుంది. కాకినాడ అచ్చంపేట జంక్షన్ సమీపంలోని లక్ష్మీ పరిణయ ఫంక్షన్ హాల్లో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య ఈ శుభవివాహం వైభవంగా జరిగింది. డా. మేడపాటి ఎం.ఎస్.వి. కృష్ణారెడ్డి దంపతుల కుమారుడు చి॥ సాయి శ్రీరామ్ రెడ్డి మరియు విశాఖపట్నం వాస్తవ్యులు ద్వారంపూడి రాధాకృష్ణరెడ్డి – చంద్రకళ దంపతుల కుమార్తె చి॥ల॥సౌ॥ అమిత సుష్మల వివాహం పెద్దల ఆశీస్సులతో సంప్రదాయబద్ధంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. తన ఆత్మీయుడు, లా విద్యాభ్యాస కాలంలో తనకు సీనియర్ అయిన డా. మేడపాటి ఎం.ఎస్.వి. కృష్ణారెడ్డి కుటుంబంలో జరిగిన ఈ వివాహ మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వేదమంత్రాల నాదం, బంధుమిత్రుల సందడి మధ్య కళ్యాణ బంధంతో ఒక్కటైన నూతన దంపతులకు ప్రేమ, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని, వారి దాంపత్య జీవితం శ్రీరామచంద్రుని కటాక్షంతో మంగళమయం కావాలని ఆయన ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.