లుంబిని విద్యాలయం లో ఘనంగా సరస్వతీ పూజ వేడుకలు

పయనించే సూర్యుడు మార్చి 15 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య ) చేజర్ల మండలములోని లుంబిని విద్యాలయం నందు పాఠశాల కరెస్పాండెంట్ డైరెక్టర్ రామయ్య ఆధ్వర్యంలో ఘనం గా సరస్వతిదేవి పూజ వేడుకలు నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలు 16 వ తేదీ నుండి ప్రారంభం కానున్న నేపద్యం లో విద్యార్ధిని విద్యార్థులకు సరస్వతి అమ్మ వారి కరుణ, కటాక్షాలు కలగాలని సరస్వతీ దేవి పూజ కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 10 వ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తాము పరీక్షలు బాగా రాసేలా ఆశీర్వదించాలని సరస్వతి అమ్మ వారికి మొక్కు కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లుంబిని యాజమాన్యం విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *