
పయనించే సూర్యుడు, మార్చ్ 15, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. స్త్రీలు అన్ని విభాగాలలో రాణించడం ప్రస్తుత పరిస్థితులలో అవసరమని అది విద్య ద్వారా సాధ్యమౌతుందని జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాల మణి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో టి ఎస్ యు టి ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షురాలు హేమలత అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ చైతన్య సదస్సు కు ముఖ్య అతిధిగా హాజరైన బాలమణి మాట్లాడుతూ సమాజంలో మహిళలు అనేక రంగాలలో రాణిస్తున్నప్పటికి ఇంకా వివక్షత ఉందని వివక్షతను రూపు మాపాలంటే విద్య ఒక్కటే మార్గమని, బాగా చదువుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడినప్పుడే స్వతంత్రత లభిస్తుందని మహిళా చైతన్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన టిఎస్యు టిఎఫ్ ని అభినందిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి( సీఈఓ) సరిత మాట్లాడుతూ సమాజం చక్కగా నడవాలంటే నైతిక విలువలు అవసరమని , అమ్మాయిలకు అణకువ ,అబ్బాయిలకు అమ్మాయిలను గౌరవించే సంస్కృతి నేర్పించాల ని అన్నారు , కార్యక్రములో పాల్గొన్న జి సి డి ఓ గౌసియా బేగం మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మాహిళలలో మార్పులు రావాలని,వివక్షత అన్ని స్థాయిలలో ఉందని వాపోయారు.వార్డ్ కౌన్సిలర్ బూడిద జ్యోతి మాస్ట్లడుతూ మహిళలు ఐక్యంగా సమస్యల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్ టైల్స్ (ఎడి) చౌడేశ్వరి చైతన్య సదస్సుల ద్వారా తమ సమస్యలను వివరించడంతో పరిష్కారాలకు మార్గం సుగమం అవుతుందని అన్నారు డా:మనస్విని మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ,మహిళల పట్ల ఇంకా కొంత చులకన భావం వున్నదని దాన్ని తొలగించాలంటే ఇలాంటి చైతన్య సదస్సులు అవసరమని తెలిపారు. ఐద్వా నాయకురాలు ఇర్రి అహల్య మాట్లాడుతూ మహిళలు పోరాటాలలో కూడా ముందుండాలని , జనాభా లో సగం గా ఉన్న మహిళలు మరింత చైతన్యం కలిగివుండాలని ,ప్రతి సమస్యను ఎదుర్కొనే వారుగా తయారు కావాలని కోరారు. టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ మాట్లాడుతూ సామాజిక స్పృహ కలిగిన సంఘంగా అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, మహిళాభ్యున్నతే సమాజ అభివృద్ధికి మూలమని కాబట్టి మహిళలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగాలని సావిత్రి భాయ్ పూలే చేసిన కృషిని ఎప్పుడు స్మరించుకోవాలని అన్నారు. చైతన్య సదస్సు అనంతరం వివిధ రంగాలలో కృషి చేసిన 75 మంది మహిళలకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల వారిని తమవారిగానే భావిస్తున్న టి ఎస్ యు టి ఎఫ్ లాంటి చైతన్యవంతమైన ఉపాధ్యాయ సంఘం సేవలు గొప్పవని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ యు టి ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రావు,మడూరి వెంకటేష్ , ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస రావు , జిల్లా కార్యదర్శులు కృష్ణ , శ్రీనివాస్, కృష్ణ మూర్తి ,మహిళా విభాగం నాయకులు గూడ లలిత హిమబిందు,రోజ,మమత, నర్సమ్మ ,కవిత, ఎలిజబెత్ ,మాధవి ,నిరంజని ,లతో పాటు వివిధ మండలాల బాధ్యులు బాబయ్య ,రమేష్ కనకయ్య ,శ్రీధర్ ,శ్రీనివాస్,ఉప్పలయ్య ,గోవర్ధన్ రెడ్డి ,భాస్కర్ ,నర్సింహులు ,కోరుకొప్పుల రాజు ,రాము,దేవ్ సింగ్, రమేష్ లతో 200 మంది ఉపాధ్యాయులు ,వివిధ రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు .