పయనించే సూర్యుడు మార్చ్ 15 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లా: వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఆక్రమణలు తొలగించారు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదికన మౌళిక సదుపాయాలు కల్పించారు ఆది జిల్లా మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కాదనను కానీ రఘునాథపాలెం మండల రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పువ్వాడ నగర్లో తాజా,మాజీ ప్రజా ప్రతినిధులు కలసి వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పప్పుబెల్లాళ్లాగా అమ్ముకుని కోట్లకు పడగలెత్తుతుంటే కనీసం అటువైపు కన్నెత్తి చూసే రెవిన్యూ అధికారులు లేరంటే అతిశయోక్తి కాదు భూదాన్ భూముల్లో పేదవాడు వేసుకున్న గుడిసెలను వందలాదిమంది రెవెన్యూ,పోలీసు అధికారులను ఉసిగొల్పి కూల్చివేసిన మంత్రులకు, రెవెన్యూ అధికారులకు పువ్వాడ ఉదయ్ నగర్లో జరుగుతున్న అక్రమ భూదందా కనిపించడం లేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు,గత ప్రభుత్వంలో ఏమి జరిగిందనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఇలాంటి భూదందాలను సహించడనే మంచి పేరు ఉంది కానీ నలుగురు ఆయన అనుచరులు కొంతమంది పువ్వాడ ఉదయ్ నగర్ తాజా,మాజీ ప్రజాప్రతినిధులతో నిత్యం అంటకాగుతూ దొంగ ప్లాట్లు,అమ్మకం దగ్గర నుండి మొదలుకుని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల వరకు అన్ని తానై వ్యవహరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు అంతే కాకుండా గ్రామ కార్యదర్శిని అడ్డం పెట్టుకుని అర్హులైన పేద ప్రజలను కాదని తమకు ఇష్టం వచ్చినవాళ్ళు ఇందిరమ్మ ఇళ్లు కేటాస్తూ ప్రశ్నించిన వాళ్లపై భౌతిక దాడులు చేయడమే కాకుండా పోలీసు స్టేషన్లో అక్రమ కేసులు బనాయించి,వేధింపులకు గురిచేస్తున్నట్లు పువ్వాడ నగర్ తాజా ప్రజాప్రతినిధిపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయని,సదరు ప్రజాప్రతినిధి అరాచకాలను అవసరమైతే మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి భయపడబోమని స్థానికులు అంటున్నారు,ఆ మేరకు కొన్ని వీడియోలు,ఆడియో రికార్డింగులు కొంత మంది మీడియా ప్రతినిధులకు పంపించామని త్వరలో తాజా, మాజీల దౌర్జన్యాలు,అక్రమ భూదందాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు అదే విధంగా కోయచలక రెవెన్యూ పరిధిలోని 192 సర్వే నెంబరుతో పాటు మరికొన్ని సర్వే నెంబర్లలో దురాక్రమణకు గురైన ప్రభుత్వ భూముల లిస్టు తయారు చేస్తున్నామని,ఎవరెవరు ఎంత ఆక్రమించారు, ఎవరి అధీనంలో ఎంత ప్రభుత్వ భూమి ఉంది అనే విషయం మీద పూర్తి ఆధారాలతో ముగ్గురు జిల్లా మంత్రులతో పాటు జిల్లా కలెక్టరును కలిసి పువ్వాడ నగర్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని అంతే కాకుండా ఇందిరమ్మ ఇళ్ల మంజూరి విషయంలో గ్రామ కార్యదర్శి, ప్రజాప్రతినిధి కలిసి చేస్తున్న అవినీతిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరతామని స్థానికులు వెల్లడించారు,అంతే కాకుండా అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్లపై భౌతిక దాడులు చేస్తూ,అక్రమ కేసులు బనాయించడంపై కూడా పోలీస్ కమీషనరుకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు స్థానికులు తెలియజేశారు