పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మార్చి.15.2026 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవిపట్నం మండలం శరభవరం గ్రామంలో శనివారం జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.తొలిత ఆయనకు కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు హరతులు పట్టి,పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మహిళ బృంద ప్రదర్శించిన కోలాట నృత్యాలను తిలకించారు. శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి 50 వేలు రూపాయలు, అన్నసమారాధన కార్యక్రమానికి 250 కిలోల బియాన్ని విరాళం అందించారు. కోలాటం ప్రదర్శించిన మహిళలు 30 మందికి ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున 15,000, కోలాటం నేర్పిన గురువుకి 5,000 వేలు రూపాయలు ప్రోత్సాహం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, దాసరి ధర్మ రాజు, పెద్దాడ వెంకన్న, ఆళ్ల శివ నాగరాజు, నాగ రమేష్, తాటికొండ సురేష్, తుమ్మల బుజ్జి, పదిలం చక్రరావు, మండే గౌతమ్, రాఘవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
