సౌదీ అరేబియాలో ఇటీవల నిర్వహించిన ఆసియన్ గేమ్స్ లో

★ అద్భుత ప్రతిభను సాధించిన హుస్సేన్

పయనించే సూర్యుడు మార్చి 15 అతని నియోజకవర్గ క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. సౌదీ అరేబియాలో ఇటీవల నిర్వహించిన ఆసియన్ గేమ్స్ లో కర్నూలు జిల్లా, దొడ్డి బెలగల్ గ్రామానికి చెందిన యువకుడు హుస్సేన్ అద్భుత ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు.ఆసియన్ గేమ్స్‌లో నిర్వహించిన లాక్రోస్ పోటీలలో అసాధారణ ఆటతీరుతో గోల్డ్ మెడల్ సాధించి సౌదీ అరేబియాతో పాటు తన స్వగ్రామం దొడ్డి బెలగల్, మొత్తం కర్నూలు జిల్లా పేరు ప్రపంచానికి వినిపించాడు.గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక యువకుడు కష్టపడి సాధించిన ఈ విజయం నేటి యువతకు గొప్ప ప్రేరణ. సరైన పట్టుదల, లక్ష్యం ఉంటే ప్రపంచ వేదికలపై కూడా విజయాలు సాధించవచ్చని హుస్సేన్ నిరూపించాడు. క్రీడాకారులను ప్రోత్సహిస్తే మన యువత ప్రపంచ స్థాయిలో దేశానికి కీర్తి తీసుకురాగలరని ఈ విజయం స్పష్టంగా చెబుతోంది. హుస్సేన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, కర్నూలు జిల్లాకు మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాము దొడ్డి బెలగల్ గర్వకారణం – హుస్సేన్! కర్నూలు జిల్లాకు గర్వకారణం – హుస్సేన్!మన యువతకు ప్రేరణ – హుస్సేన్!