పయనించే సూర్యుడు 15-03-2026 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ : శ్రవణ్ రాజ్ చోడవరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు హ్యూమానిటీస్ వారి నిర్వహణలో 13.03.2026 రోజున" భారతదేశ ఆర్థిక వ్యవస్థపై విద్యార్థులు ప్రదర్శించిన పోస్టర్ ప్రజెంటేషన్ " కార్యక్రమాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ బిఏ విద్యార్థులు ప్రదర్శించిన ఆర్థిక వ్యవస్థ యొక్క పోస్టల్ ప్రజెంటేషన్ ప్రోత్సహిస్తూ మరింత ఏఐ టూల్స్ ను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. హెచ్ ఓ డి డాక్టర్ రాధాకృష్ణ విద్యార్థుల ద్వారా ప్రదర్శించినటువంటి కార్యక్రమాలను విద్యార్థులు కిరణ్ కుమార్ అధ్యాపక బృందానికి వివరణాత్మకంగా ప్రదర్శించి ముఖ్యంగా ప్రదర్శించిన వాటిల్లో ఆర్థిక వ్యవస్థ పంచవర్ష ప్రణాళికల నుండి నేటి నీతి అయోగ్, గ్రీన్ రెవల్యూషన్, థియరీస్ ఇన్ ఎకనామిక్స్, నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా, స్నేక్ ఇన్ ఎకనామిక్స్ రాడార్, సుస్థిరాభివృద్ది లక్ష్యాలు మొదలగు కార్యక్రమాలు అధ్యాపక బృందాన్ని ఆకట్టుకున్నాయి. ఐ క్య్ ఏ సి సమన్వయకర్త డాక్టర్ నారాయణ మూర్తి, ఈ కార్యక్రమానికి జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ రత్నభారతి, డి.మాల్యాద్రి, బి.పిచ్చమ్మ, డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ జ్యోతి, డాక్టర్ సంధ్య డాక్టర్ సూర్యవతి, డాక్టర్వెంకటేష్, సరస్వతీ, రామలక్ష్మి, కోమల, కామర్స్ శ్రీనివాసరావు, డాక్టర్ సంతోష్, హేమ గణేష్, ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం పాల్గొన్నారు.