అంబాల్ పూర్ లో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు పెద్ద కురుమ ఆధ్వర్యంలో

కురుమలు ఐక్యతతో పోచమ్మ తల్లి బోనాలు

పయనించే సూర్యుడు మార్చి 16 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పరిధిలోని అంబల్పూర్ గ్రామంలో కురుమలు పోచమ్మ తల్లి బోనాలు ను వైభవంగా ఘనంగా జరిపారు గ్రామంలో ఉండబడిన పోచమ్మ తల్లి ఆలయానికి కురుమలు భక్తిశ్రద్ధలతో మహిళలు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని డోలు చప్పులతో పాల్గొన్నారు పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని బోనాలు దించారు అనంతరం పోచమ్మ తల్లి బోనాలు దూప దీప నైవేద్యాలు పెట్టి చిలుకలు కట్టి బెల్లం కళ్ళు శాఖ మో క్కి అమ్మవారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో కురుమ లు అందరు పాల్గొన్నారు