అన్నమయ్య జిల్లా పుంగనూరులో విషాదం

★ ద్విచక్ర వాహనం నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి ★ పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఘటన

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 16.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) పుంగునూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని బోర్ చేయించాడు.మెకానిక్ ద్విచక్ర వాహనాన్ని రాత్రంతా స్టార్టింగ్ లో ఉంచాలని సూచించడంతో ఆ వ్యక్తి బండిని స్టార్టింగ్ లో ఉంచి ఇంటి కిగడివేయడంతో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుని ఇంటిలోని నలుగురు మృతి చెందారూ.ఇందులో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం.