పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 16.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ.) మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ దాదే పల్లెలో జరిగిన ముస్లింల ఇఫ్తార్ విందులో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి పాల్గొన్నారు గ్రామ ముస్లింలు రంజాన్ పండుగను పురస్కరించుకుని ఇఫ్తార్ విందుకు ఆయనను ఆహ్వానించారు ముస్లిం పద్ధతిలో వస్త్రధారణ చేసి విందులో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఆయన ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో గని గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు
