కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వభూములను కాపాడాలి

బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాదె సత్యం

పయనించే సూర్యుడు మార్చ్ .16 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కాపాడాలని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)పట్టణ అధ్యక్షులు గాదె సత్యం అన్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండున్నర కాంగ్రెస్ పాలనలో గ్రామపంచాయతీ నుండి మొదలుకొని మున్సిపల్ కార్పొరేషన్ వరకు భూదోపిడిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల డీమార్ట్ సమీపంలోగల నాలుగు ఎకరాల కోట్లాది రూపాయల విలువగల ప్రభుత్వ అసైన్డ్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని భూకబ్జాదారులు కబ్జాలకు పాల్పడుతున్నారని వివిధ దినపత్రికల్లో వార్తా కథనాలు ప్రచురితమైనాయని పేర్కొన్నారు. అట్టి భూములను ఉన్నతాధికారులు, మంచిర్యాల శాసనసభ్యులు చొరవ తీసుకొని విచారణ చేపట్టాలని భూకబ్జాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల ఇట్టి భూములపై హైకోర్టులో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నెత్రుత్వంలో అప్పీల్ కు వెళ్తామని సూచించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మొదటి సమావేశంలో అందరికీ అవకాశం ఇవ్వాలని తెలిపారు. కార్పొరేషన్ లో దుబారా ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త వహించాలన్నారు. వేసవికాలంలో ప్రజలకు నీటి ఎద్దుడి లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేషన్ లోని 60 డివిజన్లో ప్రజలకు ఉపయోగమైన పనులు చేపట్టాలని పేర్కొన్నారు. సర్వేనెంబర్ 324.288, 289,293 లో గల భూములను ఎవరు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ పైన, మాజీ ఎమ్మెల్యే ఫై బురద జళ్లే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం లో చేసిన పనులను, ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చేసిన పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన పనులను వెంటనే చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ అబ్దుల్ సత్తార్, నాయకులు అంకం నరేష్, పల్లె భూమేష్, అత్తి సరోజ, తోట తిరుపతి, ఎడ్ల శంకర్,దామోదర్. ఉమాకాంత్. పద్మారావు. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *