గోవిందాపురం రైతు వేదికలో మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం

పయనించే సూర్యుడు మార్చి 16, (చింతకాని మండలం రిపోర్టర్.వేర్పుల కోటేశ్వరరావు). గోవిందాపురం రైతు వేదికలో “పరిపాలన అభివృద్ధిలో మహిళా సాధికారత (వి–లీడ్)” కార్యక్రమం కింద మహిళా ప్రజా ప్రతినిధులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా మొదటి రోజు అయిన 13–03–2026న ఆరు గ్రామాలకు చెందిన మహిళా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా బి. సురేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో గుడ్ గవర్నెన్స్ ఎలా ఉండాలి, దాని పని విధానం ఏమిటి, ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందనే అంశాలను వివరంగా తెలియజేశారు. అలాగే పంచాయతీల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల బాధ్యతలు ఏమిటో వివరించారు. ముఖ్యంగా మహిళలు నాయకత్వంలో ఎలా ముందుకు సాగాలి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా చెప్పారు.అదేవిధంగా రెండు రాష్ట్రాలకు చెందిన రీజనల్ కోఆర్డినేటర్ సోడా బత్తిన అంబేద్కర్ మాట్లాడుతూ మహిళలు నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, సృజనాత్మకత, ప్రజలకు సేవ చేసే విధానం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన మహిళా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఎఫర్ట్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కె. విజయ్ కుమార్, మాస్ స్వచ్ఛంద సంస్థ నుండి డాక్టర్ పత్తిపాటి లక్ష్మీకాంతమ్మ, ఎఫర్ట్ సంస్థ కోఆర్డినేటర్ కరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీకాంతమ్మ చైతన్య గీతాలతో మహిళలను ఉత్తేజపరిచారు.చివరిగా ఆరు గ్రామాలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులను ఎఫర్ట్ సంస్థ డైరెక్టర్ విజయ్ కుమార్ సన్మానించారు. అనంతరం కార్యక్రమం ముగిసింది.కాగా ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మొదటి రోజు (13వ తేదీ) ఎఫర్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గోవిందాపురం రైతు వేదికలో నిర్వహించగా, రెండవ రోజు (14వ తేదీ) మాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు రైతు వేదికలో నిర్వహించారు.