గ్యాస్ బుక్ చేసి 6 రోజులు గడిచినా డెలివరీ లేదు వినియోగదారుల ఆవేదన.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 16 బోధన్ పట్టణంలోని గోశాల ప్రాంతంలో ఉన్న దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 10వ తేదీన గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు ఓటీపీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు సిలిండర్ డోర్ డెలివరీ చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.ఇప్పటికే 6 రోజులు గడిచినా గ్యాస్ అందకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.ఇంత జరుగుతున్నప్పటికీ ఏజెన్సీ నిర్వాహకుడు మాత్రం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికీ గ్యాస్ డోర్ డెలివరీ చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు.ఇది వాస్తవానికి విరుద్ధమని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.గ్యాస్ లేక గృహిణులు మరియు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని, వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఇటువంటి ఏజెన్సీలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.