చమర్తి భేష్ నారా భువనేశ్వరి

పయనించే సూర్యుడు-16-03-2026-రాజంపేట న్యూస్ : రాజంపేట నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు అందించే సేవలు హర్షనీయమని నారా భువనేశ్వరి అన్నారు. శనివారం హైదరాబాద్ నందు వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించినందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం సందర్భంగా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజును ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ అరుదైన గౌరవం ప్రజాసేవను పెంపొందించేందుకు వినియోగిస్తానని చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు.