తోవి, అగసలదిన్నె లో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 16 రిపోర్టర్ అభి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం తోవి, అగసలదిన్నె గ్రామాలలో శనివారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మంత్రాలయం జనసేన ఇన్‌చార్జ్ వాల్మీకి బి.లక్ష్మన్న ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతం అవుతోందన్నారు. కార్యక్రమాల్లో మండల, గ్రామ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *