పయనించే సూర్యుడు : మార్చి 16 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ బాలానగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రోడ్డు మీద నుంచి బాలానగర్ ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మనమందరం కలిసి మండల కేంద్రంలో ఉన్నటువంటి సంత బజార్ రోడ్డులో పెట్టాలని నిర్ణయించడం జరిగింది ఇట్టి విషయాన్ని కొన్ని నెలల క్రితం ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఆర్ ఐ సర్వే చేయించడం జరిగింది. అయితే ఈరోజు అంబేద్కర్ స్టాండు మెట్లు తీయడం జరిగింది ఆలస్యం చేస్తే మన జాతి గౌరవాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము కావున ఇప్పుడున్న అందరూ సహకరించగలరు అంబేద్కర్ సంఘం నాయకులు వివిధ నాయకులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అని దళిత బహుజన సంఘాల నాయకులు పేర్కొన్నారు