పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్స్ పంపిణి

పయనించే సూర్యుడు న్యూస్ (సమీయొద్దీన్ )మెట్ పల్లి మార్చ్ 16 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజు న సానిటేషన్ సిబ్బంది యొక్క ఆరోగ్యకరమైన సేఫ్టీ కిట్స్, సేఫ్టీ ఎక్యుమేన్స్, పిపిఇ కిట్స్ మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి చేతుల మీదుగా సానిటేషన్ సిబ్బందికి పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ మాట్లాడుతూ సానిటేషన్ సఫాయి వర్కర్ ఆరోగ్యకరమైన సేఫ్టీ కిట్స్, పిపిఇ కిట్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు సానిటేషన్ సంబంధించి మౌలికారణ, రక్షణ చర్యలు, సిబ్బంది సంక్షేమం గురించి సానిటేషన్ సిబ్బంది డ్రైనేజ్ సమస్యలను ఏ విధంగా పరికరాలను వాడాలో వివరంగా తెలపడం జరిగిందని మున్సిపల్ అందిస్తున్న పరికరాలను భద్రపరుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీ ఓంకారి నవీన్ సానిటరీ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్ నరేష్ నిజాం పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు