ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సఫాయి కార్మికులకు ఘన సన్మానం

"సఫాయి కార్మికులకు నిత్యవసర వస్తువులు అందజేత"

పయనించే సూర్యుడుమార్చి 16 రాజేష్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సఫాయి కార్మికులకు ఘనంగా సన్మాన కార్యక్రమం సర్పంచ్ గంగాధరి స్వప్న స్వామి నిర్వహించారు. గ్రామ పరిశుభ్రతను కాపాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న సఫాయి కార్మికుల సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని సఫాయి కార్మికులకు చేతులకు రక్షణగా ఉపయోగపడే గ్లౌజులు, సబ్బులు, సరఫరా కొబ్బరి నూనె తదితర అవసరమైన వస్తువులను అందజేశారు. రోజువారీగా శ్రమించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు గౌరవం తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ తాటి సాయి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, పరిశుభ్రతలో సఫాయి కార్మికుల పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. వారు ప్రతిరోజూ కష్టపడి గ్రామ వీధులను శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని అన్నారు. గ్రామాన్ని పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడంలో వారి సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డ్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొని సఫాయి కార్మికులను అభినందించారు. కార్యక్రమంలో బొల్లం సత్తవ్వ, బొల్లం రాజేష్, గంగాధరి దుర్గయ్య, , ముత్యాల నరసవ్వ సత్తయ్య, బండి శ్రీలత తిరుపతి, ప్రజలు తొడంగి బిక్షపతి ముత్యాల రాములు,తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శ్రమజీవులకు గౌరవం ఇవ్వడమే కాకుండా సమాజంలో వారి సేవల పట్ల గౌరవ భావన పెరుగుతుందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.