బంగారు పోచమ్మ గుడికి నూతన శోభ

పయనించే సూర్యుడు న్యూస్ పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-16 రాంనగర్ బంగారు పోచమ్మ గుడికి పెయింటింగ్ పనులు స్థానిక 8వ వార్డు మెంబర్ బత్తిని ప్రశాంత్,9వ వార్డు మెంబర్ అల్లి రమేష్,10వ వార్డు మెంబర్ పున్నం మణి తేజ, తమ సొంత ఖర్చులతో పెయింటింగ్ పనులు పూర్తి చేయించారు. బంగారు పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ రాంనగర్ ప్రజలపై ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామప్రజలు చిట్టి మల్లయ్య, పిట్ల రాజయ్య, ఇజ్జగిరి రాజు, దేవరాజు, సర్దార్ సింగ్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *