బీజేపీ నాయకుడు జితేంద్ర కుమార్ ఆరోగ్యం గురించి

పరామర్శించిన పట్టణ అధ్యక్షులు తోవి నాగార్జున

పయనించే సూర్యుడు మార్చి 16 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. భారతీయ జనతా పార్టీ ఆదోని పట్టణ సెంట్రల్ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు జితేంద్ర కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి (జి జి హెచ్) లో మూడు రోజుల నుండి చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న బీజేపీ ఆదోని పట్టణ సెంట్రల్ అధ్యక్షులు తోవి నాగార్జున ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున జితేంద్ర కుమార్ తో మాట్లాడి, ఆయన త్వరగా కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా అక్కడి వైద్యులతో మాట్లాడిన నాగార్జున , జితేంద్ర కుమార్ కి అవసరమైన మెరుగైన వైద్యం అందేలా అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *