మధిర స్వేరో కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మాన్యవర్ కాన్సీరామ్ 92వ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు మార్చి 16, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలోని తిర్లాపురం గ్రామంలో మధిర స్వేరో కమిటీ ఆధ్వర్యంలో మాన్యవర్ కాన్సీరామ్ 92వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వేరో మధిర నియోజకవర్గ అధ్యక్షులు శాంపొంగు శ్యామ్ సుందర్ స్వేరో అధ్యక్షతన మరియు గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మాన్యవర్ కాన్సీరామ్ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు, ఉప సర్పంచ్ గోగుల నాగమణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం స్వేరో కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాన్యవర్ కాన్సీరామ్ బహుజన సమాజానికి రాజ్యాధికారం కల్పించాలనే లక్ష్యంతో జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. ఆయన 1934 మార్చి 15న పంజాబ్ రాష్ట్రంలో జన్మించారని తెలిపారు.బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి కాన్సీరామ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ పై తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించారని పేర్కొన్నారు.అలాగే పూలే, సాహూ మహారాజ్, నారాయణ గురు, పెరియర్ వంటి మహనీయుల ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లి బహుజనులకు రాజ్యాధికారం రావాలని కృషి చేశారని తెలిపారు.ఈ క్రమంలో 1984 ఏప్రిల్ 14న బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి, బెహన్ కుమారి మాయావతిని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబెట్టిన మహోన్నత నాయకుడు కాన్సీరామ్ అని కొనియాడారు. అలాగే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో మండల్ కమిషన్ కోసం జరిగిన పోరాటాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల స్వేరో కమిటీ సభ్యులు మాగి ముఖేష్ స్వేరో, చింతకాని మండల స్వేరో కమిటీ సభ్యులు కోప్పూరి నవీన్ స్వేరో, మాతంగి రాజేష్ స్వేరో, కొలికపోగు రాజేష్ స్వేరో, తిర్లాపురం 6వ వార్డు సభ్యురాలు ఐతం విజయ, చేపలమడుగు దీపిక, అంజమ్మ, ధనమ్మ, నవీన్ ముదిరాజ్, సతీష్ ముదిరాజ్, భార్గవ్ ముదిరాజ్, లక్ష్మీనారాయణ ముదిరాజ్, నరేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు