అంతర్జాతీయ గోల్బాల్ గేమ్ కు హున్సా విద్యార్థి ఎంపిక.

* టర్కీ దేశంలో గోల్బాల్ క్రీడా ఆడనుంది. * దేశం దాటి వెళ్లాలంటే ఆర్థిక ఇబ్బందులు. * ఆర్థిక సహాయం కొరకు ఎదురుచూపులు. *క్రీడాకారిణి ఆమె తల్లిదండ్రుల ఆవేదన.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 17 బోధన్ :సాలూర మండలం హున్సా గ్రామానికి చెందిన ఎర్రం అరిష్మ అంతర్జాతీయ గోల్బాల్ క్రీడాకు ఎంపికయ్యారు.ఈ క్రీడా ఆడడానికి ఆమె టర్కీ దేశానికి వెళ్లవలసి ఉంది.దేశం దాటి ఇతర దేశానికి వెళ్లాలంటే దాదాపు 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది.ఆమె కుటుంబ జీవనశైలి రెక్కాడితే గానీ డొక్కాడదు పరిస్థితులు ఉన్నాయి.అంతర్జాతీయ స్థాయిలో గోల్బాల్ గేమ్ ఆడటానికి ఆమె ఎంతో ఉత్సాహంగా ఉంది.అంతర్జాతీయ స్థాయిలో గెలుపొంది దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్న సంకల్పం ఆమెలో ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు అడ్డుపడుతున్నాయి.ఆర్థిక సహాయం కొరకు ఎదురుచూస్తుంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె టర్కీ దేశానికి వెళ్లడానికి ప్రోత్సహించాలని ఆమె తల్లిదండ్రులు రాజు కవితతో పాటు గ్రామస్తులు వేడుకుంటున్నారు.ఆమె చిన్న జీయర్ స్వామి స్థాపించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆశ్రమం జీవా క్యాంపస్ నేత్ర కళాశాలలో ఇంటర్మీడియట్ సిఈసి పూర్తి చేసింది.ఆమెకు సంమ్లిత ఫౌండేషన్ గోల్ బాల్ క్రీడాలో శిక్షణను ఇచ్చారు.రాష్ట్రస్థాయిలో గోల్బాల్ క్రీడాలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి క్రీడాలో ఎంపికై జాతీయ పాపబుల్స్ లో నాకు ఎవరు సాటి లేరు అన్న చందంగా పై చేయగా నిలిచి అంతర్జాతీయ క్రీడలకు ఎంపిక అయింది.ఈ క్రీడా ఆడడానికి టర్కీ దేశానికి వెళ్లాలి. ఆర్థిక ఇబ్బందులు దేశం దాటి వెళ్లలేని పరిస్థితులు ఈ క్రీడాకారునికి అడ్డుపడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో గెలిచి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొద్దామంటే ఆర్థిక ఇబ్బందులు అడ్డుగోడ కట్టాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎవరైనా దాతలు ఆర్థిక చేయూతను అందించి ప్రోత్సహించవలసిందిగా ఈ అమ్మాయి వేడుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *