అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సన్మాన నిధి.

కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప

పయనించే సూర్యుడు మార్చి 17 ఆదోని రూరల్ రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడుఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ఆధ్వర్యంలో ఈరోజు జాలమంచి గ్రామమందు అన్నదాత సుఖీభవ పీఎం కిసన్ డబ్బులు పడిన రైతుల ఇంటికి వెళ్లి వారికి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా రైతులకు ఆర్థికంగా బలాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి మరియు రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న “అన్నదాత సుఖీభవ” పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు.జాలమంచి గ్రామంలోని రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి ఖాతాల్లో పడిన డబ్బుల గురించి తెలియజేయడం జరిగిందని తెలిపారు. రైతులు ప్రభుత్వ పథకాల గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రైతుల అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీ ముఖ్య లక్ష్యమని, రైతు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని ఉమాపతి నాయుడు పేర్కొన్నారుఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు రంగస్వామి నాయుడు, ఉమ్మి సలీం, జిందేశంకర్, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ,రంగన్న, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, లక్ష్మీనారాయణ, ఎక్స్ కౌన్సిలర్ అంజి,అయ్యన్న, గనేకల్ విరుపాక్షి, మాదిరి వీరేష, బాబు నాయుడు, జగదీష్, జెసి బంగారయ్య, గిడ్డయ్య, సయ్యద్, సదుల్లా, షణ్ముఖ, వెంకటేష్, శ్రీరాములు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ నాయకులు గోవిందప్ప, బంగారయ్య, శరణప్ప, ఆంజనేయ, రామంజి, హుసేని, రంగస్వామి, చిదానంద, వెంకటేష్,రమేష్, గ్రామ నాయకులు పాల్గొనడం జరిగింది.ఈకార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *