అసత్య ఆరోపణలతో ప్రజలను మోసం చేయలేరు.

* మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఘాటుగా ఫైర్ అయిన పుచ్చ ఈశ్వరరావు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 17 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీషమ్మ ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడ పై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు తీవ్రంగా ఖండించారు. పలాస నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి భయపడే పరిస్థితిలో వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి శాసనసభ్యురాలు నిరంతరం కృషి చేస్తూ పలాస అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దేశ స్థాయిలో రాష్ట్రానికి గౌరవం తీసుకొస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సేవలో ఉన్న నాయకులపై అనవసర విమర్శలు చేయడం వైసీపీ నాయకుల రాజకీయ అసహనానికి నిదర్శనమని అన్నారు.వైసీపీ నాయకులు తమ పాలనలో జరిగిన వైఫల్యాలను దాచిపెట్టేందుకు ఇతరులపై ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు ఎక్కువ రోజులు నిలవవని, ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా విమర్శలతో రాజకీయాలు చేయడం ప్రజలు ఇక సహించరని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *