ఆంధ్రప్రదేశ్‌ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్

కర్నూలు జిల్లా చైర్మన్ గా కునిగిరి నీలకంఠ నియామకం

పయనించే సూర్యుడు మార్చ్ 17 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ కర్నూలు జిల్లా చైర్మన్ గా కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కునిగిరి నీలకంఠను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ అంబటి నవ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారుగతంలో కునిగిరి నీలకంఠ బిజెపిలో పలు హోదాల్లో పని చేశారు బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా, బిజెపి కర్నూలు జిల్లా అధ్యక్షుడు కూడా పనిచేశాడునేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ యొక్క ప్రధాన లక్ష్యం రాష్ట్రంలో ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, పంచభూతాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం.నూతనంగా నియమితులైన జిల్లా చైర్మన్ కునిగిరి నీలకంఠ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంచడం మరియు గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించడం నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది ఆయన అన్నారుఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల స్థానిక కమిటీల నియామక ప్రక్రియ కొనసాగుతోంది అని. రాబోయే రోజుల్లో మండల స్థాయి వరకు సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించే కార్యాచరణ చేపట్టబడుతుంది అని అన్నారు.నాకు ఈ అవకాశం కల్పించిన , బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఏంఎల్ సి సోము వీర్రాజు కీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో. క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సావిత్రి కునిగిరి నీలకంఠ కి అభినందనలు తెలిపిన బీజేపీ నాయకులు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్,అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్,ఆదోని రూరల్ సాదాపురం అధ్యక్షులు ఉషా రాజు,ఆదోని రూరల్ పెద్ద తుంబళం అధ్యక్షులు వేణుగోపాల్, ఆదోని అర్బన్ నార్త్ మండల అధ్యక్షులు బోయ మహదేవ్, ఆదోని అర్బన్ సెంట్రల్ అధ్యక్షులు నాగార్జున,ఆదోని అర్బన్ సౌత్ మండల అధ్యక్షులు మహబూబ్ బాషా.