
పయనించే సూర్యుడు మార్చి 17 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ అనంతరం ఆర్ట్స్ కళాశాలలో ప్రెస్ మీట్ ను ఉద్దేశించి డి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ..ఆదోని పట్టణంలో ఉన్నటువంటి బిసి హాస్టల్ లో విద్యార్థులతో పని చేపించిన హాస్టల్ వార్డెన్ పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు విద్యార్థులను హాస్టల్లో వదిలి తల్లిదండ్రులు వలసలకు వెళ్తున్నారు. కానీ, బీసీ హాస్టల్ లో వార్డెన్ తీరుపై డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాము..విద్యార్థుల చేత పని చేపించడం ఏంటి?* బీసీ వెల్ఫేర్ ఏం చేస్తున్నారు ?? కేవలం సీటుకు మాత్రమే పరిమితం అవుతున్నారా . లేదా .?? ఇలాంటి సంఘటనలు బీసీ వెల్ఫేర్ సార్ దృష్టికి వెళ్లలేదా. హాస్టల్ లో ఉన్న విద్యార్థుల చేత ఇలా పని చేపిస్తుంటే బీసీ వెల్ఫేర్ ఏం చేస్తున్నారని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తున్నాము. బీసీ సంక్షేమ శాఖ అధికారి సబితమ్మ తక్షణమే సమగ్ర విచారణ జరిపి విద్యార్థులతో పని చేపించిన బీసీ హాస్టల్ వార్డెన్ పైన అలాగే బీసీ వెల్ఫేర్ పైన సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. లేనిపక్షంలో డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులకు తెలియజేస్తున్నాము… ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు హరి మోహన్ విక్రమ్ రాజ్ కుమార్ వినోద్ తదితరులు పాల్గొనడం జరిగింది.