ఆరోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి విశ్వబ్రాహ్మణ సంఘం చేయూత

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 17, తల్లాడ రిపోర్టర్ మండల పరిధిలోని గంగిదేవి పాడు గ్రామానికి చెందిన సత్తెనపల్లి నరసయ్య కు గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు అతనికి తల్లాడ,వైరా,తిరువూరు విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు తల్లాడ మండల విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు రుద్రాక్ష నరసింహచారి ఆధ్వర్యంలో సోమవారం ఆ కుటుంబానికి చేయూతగా వైద్య ఖర్చుల నిమిత్తం రూ 16116 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉల్లి శ్రీనివాసరావు, బండారు భాస్కరాచారి, కొక్కొండ వీరభద్రాచారి, కొక్కొండ సత్యం, విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.