ఉగ్ర అండదండలతో గాజులదిన్నె ప్రాజెక్ట్ నుండి అక్రమంగా ఎర్రమట్టి తరలింపు

* అధికారుల అనుమతులు లేకుండా యదేచ్చగా రవాణా * ప్రభుత్వం బడా బాబు పేరు చెప్పి ఏదేచ్ఛగా ఎర్ర మట్టి అక్రమ రవాణా * అతను వెనుకున్న ఆ బడా బాబు ఎవరు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 17, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ గోనెగండ్ల మండలంలో యదేచ్ఛగా అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న దృశ్యం గాజులదిన్నెలో ఒక అధికారి అండదండలతో 20 ట్రాక్టర్లతో ఎర్రమట్టి తరలింపు ఆదివారం స్థానిక పరిసరాల ప్రాంతం నుండి అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న సమాచారం,దాదాపు 20 ట్రాక్టర్లు తో కలిసి ఎర్రమట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను ప్రభుత్వం, బడా నాయకుడు పేరుచెప్పి మండలంలో యదేచ్చగా అక్రమంగా మట్టి తరలింపు, మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. అటు మైనింగ్ అధికారుల, ఇటు మండల అధికారుల అనుమతులు లేకున్నా, వున్నట్టు అధికారులు పేర్లు చెప్పుకొని ఎర్ర బంగారాన్ని తరలిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకంటూ, చెప్పి ఇతరులకు అమ్ము కుంటున్న వైనం, శని ఆది వారాలు వచ్చిందంటే చాలు అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా ఎర్ర మట్టిని యదేచ్చగా తరలిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం సెలవు దినం కావడంతో ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు ఎక్కంగా 20 ట్రాక్టర్లు ఒక్క జేసిబి తో ఎర్ర మట్టి గ్రామాలకు తరలిస్తున్నట్టు, సమాచారం ట్రాక్టర్ యజమాను లపై, ఎర్ర మట్టి తరలింపు చర్యలు చెప్పటిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మండలానికి ప్రకృతి అందమైన గాజులదిన్నె ప్రాజెక్ట్ ను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *