ఉచిత గాలి కుంటు  వ్యాది  నివారణ  టీకాల కార్యక్రమం

పయనించే సూర్యుడు చీడికాడ అనకాపల్లి జిల్లా 17.2.2026 చీడికాడ మండలంలోని చీడికాడ, వరహాపురం, సిరిజాం, వెళ్ళంకి, చుక్కపల్లి, తురువోలు, పెద గోగాడ మరియు జైతవరం గ్రామాలలో ఈరోజు గాలి కుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఉచిత గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమాన్ని   పాడి రైతులందరూ సద్వినియోగపరచుకొని వారి వద్ద ఉన్న నాలుగు నెలల వయసు దాటిన ప్రతి పాడి పశువు కు టీకాలు ఇప్పించాలని మాడుగుల పశువైద్య శాల సహాయ సంచాలకులు డా. చిట్టి నాయుడు అన్నారు. పాడి రైతులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని టీకాలు వేయించుకుంటే పశువులకు గాలి కుంటు వ్యాధి రాకుండా ఉంటుందని సూచించారు. గాలి కుంటు వ్యాధి సోకిన పశువులు తీవ్రమైన జ్వరం మరియు నీరసం. కొద్దిపాటి ఎండకు కూడా రోప్పడం. చూడి పశువులు ఈసుకుపోవడం. ఎద్దులలో పని సామర్థ్యం తగ్గటం. పాల ఉత్పత్తి తగ్గి పని చేసే సమర్ద్యం కూడా తగ్గిపోతాయి వ్యాధి సోకిన తల్లి పాలు త్రాగే దూడలకు మరణం సంబవించవచ్చు. తక్షణ వైద్యం అందించక పోతే పశు చనిపోయే చీడికాడ లో జరిగిన కార్యక్రమాన్ని సహాయ సంచాలకులు డా. చిట్టి నాయుడు మరియు మండల పార్టీ అధ్యక్షులు పోతల రమణమ్మ చిన్నం నాయుడు ప్రారంభించారు.జైతవరం లో కార్యక్రమం నకు జైతవరం సర్పంచ్ కోడూరు సత్యవతి, మాజీ సర్పంచ్ డోకల హక్కు నాయుడు, నీటి సంఘం డైరెక్టర్ రెడ్డి కాశి , మాజీ మంచాల మోడల్ స్కూల్ కమిటీ చైర్మన్ కురచా రామకృష్ణ, సచివాలయ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాడి రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు