ఉట్నూర్ నూతన తహసీల్దార్ రఘునాథ్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్‌వీ నాయకులు

పయనించే సూర్యుడు మార్చి 17 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఉట్నూర్ తహసీల్దార్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రఘునాథ్ రావును బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందించారు ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సోషల్ మీడియా నాయకులు బాబా శ్యామ్ టైగర్ కమేరి రాజు తదితరులు పాల్గొన్నారు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రఘునాథ్ రావుకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రఘునాథ్ రావు మాట్లాడుతూ.. ఉట్నూర్ మండల ప్రజలకు రెవెన్యూ శాఖ సేవలు సులభంగా అందేలా కృషి చేస్తానని తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉంటూ పారదర్శకంగా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు ప్రజాప్రతినిధులు నాయకులు రెవెన్యూ శాఖ పనితీరుకు సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *