ఉడుగుల కుంట తండాలో గ్రామ సభ నిర్వహణ

గ్రామాభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ బుజ్జి చందులాల్ పిలుపు

పయనించే సూర్యుడు మార్చి 17 నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలంలోని ఉడుగుల కుంట తండా గ్రామంలో ఈరోజు సర్పంచ్ కాట్రావత్ బుజ్జి చందూలాల్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలపై గ్రామస్థులతో చర్చించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బుజ్జి చందూలాల్ మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయ్యాయని, ఇక గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రామస్తులందరూ సహకరిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లగలమని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలు అవసరం లేకుండా ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బకు గురికాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీను నాయక్, వార్డు మెంబర్లు, నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.